Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిల్లర డబ్బులిచ్చినందుకు.. సాండ్‌విచ్‌ను ఇన్ని ముక్కలు చేసిచ్చారు..

ఇంటర్నెట్ డెస్క్: ఆకలితో రెస్టారెంట్‌‌కు వెళ్లి.. సాండ్‌విచ్ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి అక్కడి సిబ్బంది షాక్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో స్పందింస్తున్న నెటిజనం.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..


ఓ వ్యక్తికి బాగా ఆకలి వేసింది. దీంతో మొదటగా తన జేబులు తడుముకున్నాడు. అందులో కొన్ని డబ్బులు ఉన్నట్లు గుర్తించాడు. అనంతరం దగ్గర్లో ఏదైనా రెస్టారెంట్ ఉందా అని పరిశీలించాడు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్ అతడి కంటపడింది. దీంతో వెంటనే వెళ్లి.. అక్కడ వద్ద ఉన్న నాణాలతో సాండ్ విచ్ ఆర్డర్ ఇచ్చాడు. అనంతరం తాను అర్డర్ ఇచ్చిన సాండ్‌విచ్‌ను రెస్టారెంట్ ఓ కవర్‌లో పెట్టుకుని సిబ్బంది తీసుకొచ్చారు. అయితే దాన్ని ఓపెన్ చేసిన ఆ వ్యక్తి.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సాండ్‌విచ్ 16 చిన్న చిన్న ముక్కలుగా ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. అనంతరం నాణాలతో ఆర్డర్ చేసినందు వల్లే.. తాను ఆర్డర్ చేసిన సాండ్‌విచ్‌ను 16 ముక్కలు చేసి ఇచ్చినట్లు గుర్తించాడు. అనంతరం దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అందకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ ఫొటోను 16వేల మంది లైక్ చేయగా.. సుమారు వెయ్యి మంది రీట్వీట్ చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement