Advertisement
Advertisement
Abn logo
Advertisement

నైపుణ్యంతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

‘నన్నయ’ ఉప కులపతి ఆచార్య జగన్నాథరావు

దివానచెరువు, డిసెంబరు 3: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాయలం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు కోరారు. యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘సావిష్కర-2కే21’ మేనేజ్‌మెంట్‌ ఉత్సవాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక కాలంలో సం స్థల అభివృద్ధిలో మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల పాత్ర కీలకమని, అవకా శాలను అందిపుచ్చుకునే  ప్రయత్నాలు చేయాలన్నారు. కార్యక్రమంలో గెయిల్‌ జనరల్‌ మేనేజరు (ఆపరేషన్స అండ్‌ మేనేజ్‌మెంట్‌) బీఎన రావు, సీనియర్‌ మేనేజరు బి.బాలాజీ, ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.టేకి, మేనేజ్‌ మెంట్‌ విభాగాధిపతి సి.ఉమామహేశ్వరి, డీన ఎన.ఉదయభాస్కర్‌ తదితరులు  పాల్గొన్నారు. బిజినెస్‌ గేమ్స్‌, కామర్స్‌ అండ్‌ టూరిజం గేమ్స్‌, మైండ్‌ గేమ్స్‌ నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


Advertisement
Advertisement