Advertisement

కేసీఆర్ ఆశీస్సులు పొందిన ‘మనం సైతం’ కాదంబరి కిరణ్

‘మనం సైతం’ అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద సినీ కళాకారులకు అండగా నిలుస్తున్న నటుడు కాదంబరి కిరణ్ కేసీఆర్ ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్‌ను ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ మర్యాద పూర్వకంగా ప్రగతి భవన్‌లో కలిశారు. డిసెంబర్ 8వ తేదీన జరగనున్న తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావలసిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ, శుభలేఖను అందించారు. ఈ సందర్భంగా ‘మనం సైతం’ ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను కేసీఆర్‌కు వివరించి, వారి ఆశీస్సులను పొందారు. 

Advertisement