Apr 21 2021 @ 19:09PM

రాశి ఖన్నా విడుదల చేసిన 'మనసా వినవా' లిరికల్ సాంగ్..!

దర్శకుడు హీరో అవసరాల శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం '101 జిల్లాల అందగాడు'. దిల్ రాజు - క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'చి.ల.సౌ' ఫేమ్ రుహానీ శర్మ అవసరాల శ్రీనివాస్‌కి జంటగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'మనసా వినవా'  అంటూ సాగే మెలోడీ లిరికల్ వీడియో సాంగ్‌ను హీరోయిన్ రాశి ఖన్నా విడుదల చేశారు. ఇక ఈ సాంగ్‌ను శ్రీరామ్ చంద్ర, ధన్య బాలకృష్ణ పాడగా  భాస్కరభట్ల సాహిత్యం అందించారు. శక్తికాంత్ కార్తిక్ సంగీగమందిస్తుండగా ఈ సాంగ్ ప్రేక్షక్లులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమా ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మంచి మెలోడీ సాంగ్‌ను మీరు చూసి ఆనందించండి.