Abn logo
Nov 22 2020 @ 19:10PM

సోనూసూద్‌లా రియాక్ట్ అయిన మంచు మనోజ్‌

Kaakateeya

కరోనా లాక్‌డౌన్‌లో, ఆ తర్వాత కూడా రియల్‌ హీరో అనిపించుకున్నారు హీరో సోనూసూద్‌. కష్టాల్లో ఉన్న ఎందరికో సోనూసూద్‌ అండగా నిలిచారు. ఆ వుడ్‌, ఈ వుడ్‌ అని లేకుండా.. సినిమా ఇండస్ట్రీలకు చెందిన వారు, ప్రజలు సోనూసూద్‌ని ఎంతగానో కొనియాడారు. ప్రస్తుతం ఆయన పాల్గొంటున్న షూట్స్‌లో ఆయనని గౌరవంగా సన్మానిస్తున్నారు. ఇప్పుడిదే దారిలో నడుస్తున్నాడు మంచు హీరో మనోజ్‌. అప్పట్లో హైదరాబాద్‌లోని వలస కూలీల కోసం బస్సులను ఏర్పాటు చేసిన మనోజ్‌.. తాజాగా ట్విట్టర్‌లో ఆపదలో ఉన్నామని సాయం చేయండని వేడుకుంటున్న వారికి అభయహస్తం ఇచ్చేశారు. టాలీవుడ్‌ సోనూసూద్‌ అనేంతగా తన ట్వీట్‌తో ఆ అవసరార్థులకి అండగా నిలుస్తానని మాటిచ్చారు.


మనోహర్‌ అనే ఆటోడ్రైవర్‌.. బోన్‌ కేన్సర్‌తో బాధపడుతున్న తన బిడ్డకు చికిత్స చేయించేందుకు డబ్బులు లేవని, సాయం చేయాలని ఏడుస్తూ వేడుకున్నాడు. ఇది ట్విట్టర్‌ ద్వారా తెలుసుకున్న మంచు మనోజ్‌ వెంటనే డిటైల్స్‌ పంపాలని కోరాడు. ధైర్యంగా ఉండండి.. ఆ హాస్పటల్‌ డిటైల్స్‌ పంపమని కోరాడు. ఆ తర్వాత సేమ్‌ టు సేమ్‌.. ఇలాగే అన్నా.. మాకు కూడా హెల్ప్‌ చేయండి అని వచ్చిన మరో ట్వీట్‌కు కూడా మనోజ్‌ సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. దీంతో నెటిజన్లు.. మనోజ్‌ని టాలీవుడ్‌ సోనూసూద్‌గా వర్ణిస్తూ.. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.Advertisement
Advertisement