Sep 6 2021 @ 15:42PM

ఏపీ సీఎం జగన్‌ను కలిసిన మంచు మనోజ్‌

హీరో మంచు మనోజ్‌ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని మనోజ్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘’సీఎం జగన్‌ను కలవడం నాకు దక్కిన గౌరవం. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు, దూరదృష్టి నన్ను ఎంతగానో ఆకర్షించాయి..’’ అని మంచు మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంకా రాష్ట్ర అభివృద్ధి పట్ల వైఎస్ జగన్‌కు ఉన్న దార్శనికతకు ముగ్దుడినయ్యానని, ఆయన పరిపాలనకు అభినందనలు తెలుపుతున్నట్లుగా మనోజ్ ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల తన డ్రీం ప్రాజెక్ట్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లను మనోజ్ కలిసిన సంగతి తెలిసిందే.