MAA Election: బ్రహ్మానందం గారు అందరినీ తోసేసి బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లారు: మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-10T17:53:54+05:30 IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా జరుగుతోంది. కౌగిలింతలు, కొరుకులాటలతో పోలింగ్ ఆసక్తికరంగా సాగుతోంది.

MAA Election: బ్రహ్మానందం గారు అందరినీ తోసేసి బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లారు: మంచు విష్ణు

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా జరుగుతోంది. కౌగిలింతలు, కొరుకులాటలతో పోలింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం అందరినీ తోసేసి బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లినట్లు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న మంచు విష్ణు తెలిపారు. తన ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌తో కలిసి మంచు విష్ణు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. ‘‘మా ఇద్దరికీ అర్థం కాని విషయం ఏంటంటే.. బ్రహ్మానందం గారు వచ్చి అందరినీ తోసి ఆయన బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లి గుద్దారు. అది ప్రకాష్ రాజ్‌కు గుద్దారా? నాకు గుద్దారా? తెలియట్లేదు. అడిగినందుకు ఆయన గట్టిగా అరిచారు.’’ అని మంచు విష్ణు తెలిపారు.

Updated Date - 2021-10-10T17:53:54+05:30 IST