Sep 22 2021 @ 15:43PM

‘మా’: మంచు విష్ణు ప్యానల్ ప్రకటనకు టైమ్ ఫిక్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు యంగ్ హీరో మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. మా కు ఓ ప్రత్యేక భవనాన్ని నిర్మించి ఇస్తానని మాటిచ్చి.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకొనే ప్రయత్నంలో ఉన్నారు విష్ణు. అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుండగా.. అదే రోజున ఫలితాలు కూడా వెలువడతాయి. ఇక ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్స్ స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో  మంచు విష్ణు రేపు అంటే సెప్టెంబర్ 23న తన ప్యానల్ సభ్యుల్ని ప్రకటించనున్నారు.

మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు విష్ణు.. సినీ పరిశ్రమ లోని మహా మహులను రంగం లోకి దింపబోతున్నారు. ఇప్పటికే మంచు విష్ణు టీమ్ లో బాబు మోహన్,  రఘు బాబు ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో బాబు మోహన్ వైస్ ప్రెసిడెంట్ కాగా, జనరల్ సెక్రెటరీ గా రఘు బాబు ఉన్నారు.  ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు ధీటుగా  మంచు విష్ణు ప్యానెల్ తన ప్యానల్ సభ్యుల్ని రేపు ప్రకటించబోతున్నారు. సాధారణ ఎన్నికల్ని తలపిస్తూ ఈ సారి మా ఎన్నికలు సాగడం విశేషమని చెప్పాలి.