దక్షిణాది తారలే కాదు.. ఉత్తరాది తారలు కూడా మాట్లాడుకునే అందం మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ సొంతం. మరి ఇంత అందంగా ఉండటానికి మహేశ్ ఏం చేస్తాడనేది ఎవరికీ తెలియని రహస్యం. అయితే మహేశ్ అందం వెనుక సీక్రెట్ నేను కనిపెట్టానోచ్ అని అంటున్నారు హీరో మంచు విష్ణు. రీసెంట్గా జరిగిన విష్ణు సతీమణి వెరోనికా బర్త్‌డే ఫంక్షన్లో మహేశ్, నమ్రతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్-నమ్రత, విష్ణు-వెరోనికా తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు మంచు విష్ణు. 'ఈ ఫొటోలోని వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిగా మారిపోతున్నాడు. ఆయన అంత అందంగా ఉండటానికి కారణం ఆయన మంచితనమే' అని మెసేజ్‌ను కూడా ఫొటోతో పాటు పోస్ట్ చేశాడు విష్ణు. దీనిపై స్పందించిన మహేశ్ 'చాలా మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్స్' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫంక్షన్లో హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు.