మాస్కులు ధరించకుంటే ప్రభుత్వ సేవలు కట్!

ABN , First Publish Date - 2020-07-05T14:54:04+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారందరికీ ప్రభుత్వ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

మాస్కులు ధరించకుంటే ప్రభుత్వ సేవలు కట్!

టెహ్రాన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారందరికీ ప్రభుత్వ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఆదివారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అధ్యక్షుడు హసస్ రూహానీ తెలిపారు. కరోనా కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయన శనివారం నాడు ప్రజలను ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు.


‘మాస్కులు పెట్టుకోని వారికి ప్రభుత్వాధి కారులు ఎటువంటి సహాయం చేయకూడదు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులెవరైనా ఈ నిబంధన పాటించకపోతే వారు విధులకు హాజరు కానట్టు పరిగణించి ఇంటికి పంపేస్తాం. కార్యాలయాలను మూసేస్తాం’ అని తెలిపారు. కరోనా బారిన పడ్డ వారు ఆ విషయాన్ని బహిరంగ పరచడం మతపరమైన బాధ్యత అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని దాస్తే అది ఇతరుల హక్కులను ఉల్లంఘించడమేనని హసన్ స్పష్టం చేశారు.


తాజా లెక్కల ప్రకారం ఇరాన్‌లో కరోనా కేసుల సంఖ్య 2.4 లక్షలకు చేరువవుతోంది. మరణాల సంఖ్య 11,408కి చేరుకుంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. 

Updated Date - 2020-07-05T14:54:04+05:30 IST