జీవనదిలా మానేరు

ABN , First Publish Date - 2021-04-20T06:07:23+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఎగువ మానేరుకు జలకళ తేవడం సాధ్యమైందని, ఎగువ మానేరు నుంచి మిడ్‌ మానేరు వరకు మానేరు వాగు జీవ నదిలా కనిపిస్తోందని పురపాలక, ఐటీ శాఖ మం త్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం జిల్లాలో పర్యటించారు. ఇల్లంతకుంటలో నిరసనలు ఉద్రిక్తతల మధ్య అభివృద్ధి పనుల ప్రారంభోత్సవా లు జరిగాయి.

జీవనదిలా మానేరు
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు వద్ద పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌

 - కాళేశ్వరం జలాలతో మత్తడి దూకుతున్న ప్రాజెక్టులు 

-  ఎగువ మానేరు నుంచి మిడ్‌ మానేరు వరకు 13 చెక్‌డ్యాంలు 

-   గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 

-  దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి

-   పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

-   అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఎగువ మానేరుకు జలకళ తేవడం సాధ్యమైందని, ఎగువ మానేరు నుంచి మిడ్‌ మానేరు వరకు మానేరు వాగు జీవ నదిలా కనిపిస్తోందని  పురపాలక, ఐటీ శాఖ మం త్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం  జిల్లాలో  పర్యటించారు. ఇల్లంతకుంటలో నిరసనలు ఉద్రిక్తతల మధ్య అభివృద్ధి పనుల ప్రారంభోత్సవా లు జరిగాయి. అనంతరం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కరోనా కట్టడి చర్యలపై సమీక్షించారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో కొండపొచమ్మ ప్రాజెక్ట్‌ నుంచి కూడెళ్లి వాగు ద్వారా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ను గోదావరి జలాలతో నింపారు. మంత్రి కేటీఆర్‌ ప్రాజెక్ట్‌ వద్ద గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇరిగేషన్‌ ఏర్పాటు చేసి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మ్యాప్‌ను పరిశీ లిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఎగు వ మానేరు ప్రాజెక్ట్‌ను నింపాలని పాదయాత్రలు, ధర్నాలు చేశారని,  ఎంతో మంది మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చిపోయారని అన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్‌తోనే అరుదైన దృశ్యాలను తెలంగాణ ప్రజానీకానికి అడుగు అడుగునా అవి ష్కృతం అవతున్నాయన్నారు. ఎగువ మానేరులో కాళేశ్వరం నీటిని చూసిన తరువాత ఆ దృశ్యం ఇక్కడ ఉన్న వారి  మనసులో నిలిచిపోతుందన్నారు. వర్షాలు పడినపుడు మ్రాతమే కనిపించే జల దృశ్యాలు ఎర్రటి ఎండలో కనిపిస్తున్నాయన్నారు. 2009 లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గూడూరు ప్రచా రా నికి వెళ్లినపుడు అక్కడి ప్రజలు నర్మాలను నింపా లని, జిల్లెలకు వెళ్తే నక్కవాగును నింపాలని కోరార న్నారు. కాలంతో పోటీ పడే విధంగా కాళేశ్వరం జలాలతో చెరువులు, వాగులు, చెక్‌ డ్యాంలలో నీటి ని నింపుతూ ముందుకు సాగుతున్నామన్నారు. సిరి సిల్ల నియోజకవర్గంలో ఎగువ మానేరు ప్రాజెక్ట్‌ నుంచి మిడ్‌ మానేరు వరకు 13 చెక్‌ డ్యాంలను నిర్మించనున్నట్లు,   జూన్‌ వరకు పూర్తి చేయనున్న ట్లు చెప్పారు. 

ఎగువ మానేరు జలకళను సంతరిం చుకుందని, మత్స్య సంపదకు వ్యవసాయానికి లో టు ఉండదని అన్నారు.  ఎగువ మానేరు ప్రాజెక్ట్‌తో తమ కుటుం బానికి అనుబంధం ఉందని, ఈ ప్రాజెక్ట్‌లోనే మా నాయనమ్మ ఊరు దోమకొండ మండలం పోశాను పల్లె ఊరు ముంపునకు గురైందని అన్నారు. మిడ్‌ మానేరులో అమ్మమ్మ ఊరు కొదురుపాక ముంపు నుకు గురైందన్నారు. నిర్వాసితుల త్యాగం గొప్పద ని, వారికి పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. ఆంధ్రా ప్రాంతంలో కొటన్‌ దొర విగ్రహాలు ఏలా పెట్టారో, తెలంగాణలో  కేసీఆర్‌ పేరు అలాగే నిలిచి పోతుందని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసా ధ్యం అనుకున్న ఎన్నో కార్యక్రమాలను సుసాధ్యం చేశారన్నారు. కాళేశ్వరం జలాలతో మండుటెండలో మత్తడి దూకిస్తున్నార న్నారు.శరవేగంగా ప్రాజెక్ట్‌లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మిడ్‌ మానేరు, అనంతారం ప్రాజెక్ట్‌లు వాటర్‌ జంక్షన్‌లుగా మారా యన్నారు. రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. రుణమాఫీలో రూ.25 వేలు ఇప్పటికే మాఫీ  చేశా మని, మిగతా వాటిని మాఫీ చేయడానికి రూ.5250 కోట్లు కేటాయించా మని తెలిపారు.  దేశంలో ఎక్క డా లేని విధంగా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యా యులకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యాన్ని అంది స్తున్నామన్నారు. ఎంత సంక్షోభం వచ్చినా పేదల సంక్షేమాన్ని వీడడం లేదన్నారు.


కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారు... 

కేంద్ర ప్రభుత్వానికి సంబం ధించిన ప్రజా ప్రతినిధి, కరీం నగర్‌ ఎంపీ, బీజేపీ అధ్యక్షుడు రెండేళ్లలో పార్లమెంట్‌ నియో జకవర్గానికి ఎన్ని  ప్రత్యేక నిధులు తెచ్చారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎంత సే పు మతం పేరిట రెచ్చగొట్ట డం, చిల్లర రాజకీయాలు చేయడం కాదని, అభివృద్ధిలో పోటీపడాలని హితవు పలికా రు. తాము  ఎలాగైతే గ్రామా లను  అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నామో ఆ విష యంలో పోటీ పడాలని అన్నారు.  కేసీఆర్‌పై చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజు లు  చూడరని, కీలెరిగి వాత పెడతారని  అన్నారు కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తేగలరా? అని ప్రశ్నించారు. చేతనైతే జాతీయ రహదారు లను తీసుకు రావాలన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిందని నాగార్జునసాగర్‌లో జయ కేతనం ఎగుర వేస్తుందని అన్నారు. బీజేపీకి డిపా జిట్‌ గల్లంతు అవుతుందన్నారు. ఏడు మున్సి పాలిటీలో కూడా టీఆర్‌ఎస్‌ గెలవబోతోందన్నారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జాతీయ సహకార బ్యాంకుల చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-20T06:07:23+05:30 IST