‘పాలవెల్లువ’తో బహుళ ప్రయోజనం

ABN , First Publish Date - 2021-06-16T07:22:28+05:30 IST

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న పాల వెల్లువ పఽథకం ద్వారా పాడిరైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు చెప్పారు.

‘పాలవెల్లువ’తో బహుళ ప్రయోజనం
సర్వే చేస్తున్న అధికారులు

తాళ్లూరు, జూన్‌ 15 : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న పాల వెల్లువ పఽథకం ద్వారా పాడిరైతులకు బహుళ ప్రయోజనం చేకూరుతుందని ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు చెప్పారు. మన్నేపల్లి, తురకపాలెం గ్రామపంచాయతీ పరిధిలో పాలవెల్లువ కోసం నిర్వహిస్తున్న సర్వేను మంగళవారం పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ పాల రైతులు సంఘాలుగా ఏర్పడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలలో పాలను విక్రయించి ఆర్థికంగా వృద్ధి చెందాలని చెప్పారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్‌ మంచాల వెంకటేశ్వరరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-16T07:22:28+05:30 IST