మ్యాంగో చీజ్‌ కేక్‌

ABN , First Publish Date - 2021-06-09T21:59:40+05:30 IST

కేక్‌ దిగువ పొరల కోసం: మ్యారీ బిస్కట్స్‌- 14, తేనె- మూడు స్పూన్లు, యాలకుల పొడి- పాపు స్పూను.

మ్యాంగో చీజ్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: కేక్‌ దిగువ పొరల కోసం: మ్యారీ బిస్కట్స్‌- 14, తేనె- మూడు స్పూన్లు, యాలకుల పొడి- పాపు స్పూను.

పై పొరల కోసం: మామిడిపళ్ల స్మూతీ- 3 కప్పులు, క్రీమ్‌ చీజ్‌- 200 గ్రాములు, క్రీమ్‌- 200 ఎంఎల్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- స్పూను, చక్కెర- ముప్పావు కప్పు, జెలటిన్‌ పౌడరు- నాలుగున్నర కప్పులు.


తయారుచేసే విధానం: ముందుగా బిస్కట్లను పొడిగా చేసుకోవాలి. దీనికి తేనె, యాలకుల పొడి కూడా కలిపి మిక్సీలో వేయాలి. ఓ వెడల్పైన పాన్‌ను తీసుకుని దాని పైన బటర్‌ను పూసి బిస్కట్ల పొడిని వేసి వేళ్లతో సమంగా చేయాలి. దీన్ని పావు గంట ఫ్రిజ్‌లో పెడితే కేకు దిగువన లేయర్‌ తయారవుతుంది. ఓ బౌల్‌లో చీజ్‌ క్రీమ్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, చక్కెర వేసి బాగా కలపాలి. ఇందులోనే మ్యాంగో స్మూతీని కలిపి మిక్సీలో వేయాలి. ఓ చిన్న కప్పులో నీళ్లను తీసుకుని అందులో జెలటిన్‌ పౌడర్‌ను వేసి కలపి ఓ పదినివిషాలు అలాగే పెట్టాలి. ఆ తరవాత మామిడి మిశ్రమానికి జెలటిన్‌ నీళ్లు, క్రీమ్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బిస్కట్‌ క్రస్ట్‌ మీద వేసి ఫ్రిజ్‌లో నాలుగు గంటలు ఉంచాలి. కేక్‌ పైన క్రీమ్‌ను వేసి తాజా మామిడి పండు ముక్కలతో అలంకరిస్తే సరి.

Updated Date - 2021-06-09T21:59:40+05:30 IST