మామిడి తరుము పచ్చడి

ABN , First Publish Date - 2021-05-20T19:15:35+05:30 IST

మామిడి కాయలు- మూడు (తొక్క తీసి తురుముకున్నవి), నూనె- అర కప్పు, మెంతి పొడి- రెండు స్పూన్లు, ఆవాలు- అర స్పూను, ఇంగువ- కొద్దిగ, కారం, ఉప్పు- తగినంత.

మామిడి తరుము పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడి కాయలు- మూడు (తొక్క తీసి తురుముకున్నవి), నూనె- అర కప్పు, మెంతి పొడి- రెండు స్పూన్లు, ఆవాలు- అర స్పూను, ఇంగువ- కొద్దిగ, కారం, ఉప్పు- తగినంత.


తయారు చేసే విధానం: ఓ పాన్‌లో నూనెవేసి కాగాక ఆవాలు, పసుపు పొడి, ఇంగువ వేయాలి. దీంట్లో మామిడి తురుము, ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. మామిడి తురుము మగ్గిన తరువాత కారం, మెంతి పొడి వేసి బాగా కలపాలి. మరో అయిదు నిమిషాలు మగ్గనిచ్చి దించితే సరి. ఇడ్లీ, దోస, అన్నంతో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-05-20T19:15:35+05:30 IST