గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్న రైతులు

ABN , First Publish Date - 2021-06-11T20:43:38+05:30 IST

చిత్తూరు జిల్లా: మామిడి కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టబడిలో...

గిట్టుబాటు ధర లేక లబోదిబోమంటున్న రైతులు

చిత్తూరు జిల్లా: మామిడి కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టబడిలో రూపాయి కూడా రాక రైతులు లబోదిబోమంటున్నారు. నిరాస చెందిన రైతులు ఇప్పుడు మామిడి పళ్లను పశువులకు వేస్తున్నారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ చిత్తూరు మామిడి రైతులు  కన్నీరు మున్నీరవుతున్నారు. 


మామిడి ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు సగానికి పడిపోయాయి. ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క కరోనా, మరోవైపు మామిడి గుజ్జు తీసే పరిశ్రమల యాజమాన్యం సిండికేట్‌గా ఏర్పడ్డంతో రైతుల నడ్డి విరిచినట్లయింది. జిల్లాలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గుజ్జుకు ఉపయోగించే  తోతాపురి రకం మామిడిని గుజ్జు తీసే పరిశ్రమల యాజమాన్యం అందరూ సిండికేట్ అవ్వడంతో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. 

Updated Date - 2021-06-11T20:43:38+05:30 IST