Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో ఐస్‌క్రీం

కావలసినవి: పాలు - ఒక కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మ్యాంగో ప్యూరీ - ఒక కప్పు, మామిడికాయ ముక్కలు - ఒక కప్పు,  కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - తగినంత.


తయారీ విధానం: ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకుని అందులో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి కలపాలి. మిగిలిన పాలు పంచదార వేసి వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్‌ పొడి కలిపిన పాలు పోసి చిన్నమంటపై మరికాసేపు మరిగించాలి. గది ఉష్ణోగ్రతకు చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడికాయ ముక్కలు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటెయినర్‌లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత హ్యాండ్‌ బీటర్‌తో కలిపి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను పిల్లలతో పాటు పెద్దలు ఇష్టంగా తింటారు.

ఉసిరికాయ జ్యూస్‌కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌ మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీం
Advertisement