Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో కుల్ఫీ

కావలసినవి: పాలు - 500ఎంఎల్‌, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 100ఎంఎల్‌, మామిడిపండు గుజ్జు - 100గ్రా, పంచదార - 50గ్రా, కోవా - 50గ్రా.


తయారీ విధానం: స్టవ్‌ ఒక పాత్రను పెట్టి పాలు పోసి మరిగించాలి. చిన్నమంటపై పాల పరిమాణం సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ పాలు పోసి, పంచదార వేసి కలుపుకోవాలి. తరువాత కోవా వేసి చిన్నమంటపై ఉడికించాలి. స్టవ్‌పై నుంచి దింపి చల్లారిన తరువాత అందులో మామిడిపండు గుజ్జు వేసి బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్‌లో పోసుకోవాలి. 6 నుంచి 8 గంటలపాటు డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లచల్లని మ్యాంగో కుల్ఫీని సర్వ్‌ చేసుకోవాలి.

ఉసిరికాయ జ్యూస్‌కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌ మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌ఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీం
Advertisement