Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో మలాయ్‌ శాండ్‌విచ్‌

వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం, సత్వర శక్తి కోసం మామిడి పండు లస్సీ, పన్నా వంటివి తాగుతాం. అయితే వెరైటీగా మామడిపండుతో శాండ్‌విచ్‌ చేసుకొని తింటే భలేగా అనిపిస్తుంది. మ్యాంగో మలాయ్‌ శాండ్‌విచ్‌ తయారీ చూద్దాం...


కావలసినవి: వైట్‌ బ్రెడ్‌- రెండు ముక్కలు, మామిడి పండు ఒకటి (చిన్న ముక్కలుగా కోయాలి), మీగడ- రెండు టేబుల్‌ స్పూన్లు లేదా తాజా క్రీమ్‌, పంచదార పొడి- సగం టీ స్పూన్‌, పచ్చి యాలకుల పొడి- చిటికెడు, తాజా పుదీనా ఆకులు కొన్ని. 


తయారీ విధానం: ఒక పాత్రలో మీగడ లేదా తాజా క్రీమ్‌, పంచదార వేసి మెత్తని పేస్ట్‌ తయారుచేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్‌ ముక్కలను ప్లేట్‌లో పెట్టాలి. మీగడ, చక్కెర పేస్ట్‌ను బ్రెడ్డు ముక్కలకు ఒకవైపు రాయాలి. మామిడి పండు ముక్కలను ఒక బ్రెడ్‌ ముక్క మీద వరుసగా పేర్చాలి. తరువాత కొద్దిగా యాలకుల పొడి చల్లాలి. ఇప్పుడు రెండో బ్రెడ్‌ ముక్కను పైన పెడితే నోరూరించే మ్యాంగో మలాయ్‌ శాండ్‌విచ్‌ రెడీ. పుదీనా ఆకులు, మిగిలిన మామిడి పండు ముక్కలతో అలంకరించుకొని తినాలి.

చైనీస్‌ పకోడాపటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌
Advertisement

నవ్య మరిన్ని