Abn logo
Jul 19 2021 @ 13:18PM

రేవంత్‌రెడ్డి అరెస్టుపై పార్లమెంటులో లేవనెత్తుతాం: మాణికం ఠాగూర్

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అరెస్టుపై పార్లమెంటులో లేవనెత్తుతామని తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ తీరు హిట్లర్‌ను తలపిస్తోందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏ ప్రజాస్వామ్య సూత్రాలు పాటిస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని మాణికం ఠాగూర్ డిమాండ్ చేశారు.

కోకాపేట భూములను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేతలు రేవంత్, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఈ పర్యటనను అడ్డుకునేందుకు రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గరికి పోలీసులు భారీగా మోహరించారు. తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు.  

క్రైమ్ మరిన్ని...