పాలమూరు చుట్టూ మణిహారం

ABN , First Publish Date - 2022-01-26T05:54:29+05:30 IST

మహబూబ్‌నగర్‌లో 2010లో రూ పొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ప్రస్తుతం చేపట్టిన బైపాస్‌ నుంచి వీరన్నపేట మీదుగా రింగ్‌రోడ్డు తరహా రోడ్డును నిర్మిస్తామని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

పాలమూరు చుట్టూ మణిహారం
మహబూబ్‌నగర్‌- చించోళి అలైన్‌మెంట్‌ను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- చించోళి రహదారికి అనుసంధానం

- బాధితులకు పరిహారం ఇచ్చి న్యాయం చేస్తాం  : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, జనవరి 25 : మహబూబ్‌నగర్‌లో 2010లో రూ పొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ప్రస్తుతం చేపట్టిన బైపాస్‌ నుంచి వీరన్నపేట మీదుగా రింగ్‌రోడ్డు తరహా రోడ్డును నిర్మిస్తామని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే ప్రస్తుతం ఏనుగొండ నుంచి పాలకొండ మీదుగా భూత్పూర్‌ రహదారి వరకు బైపాస్‌ను నిర్మించామని, ఆ ప్లాన్‌ ప్రకారమే అక్కడి నుంచి వీరన్నపేట మీదుగా రింగ్‌రోడ్డు నిర్మించి మహబూబ్‌నగర్‌- చించోళి రహదారికి అనుసంధా నం చేస్తామని తెలిపారు. మంగళవారం ప్రతిపాదిత మహబూబ్‌నగర్‌- చించోళి జాతీయ రహదారి ప్రాథమిక అలైన్‌మెంట్‌ పనులకు జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులు, మునిసిపల్‌ ఇంజనీర్లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియా తో మాట్లాడారు. 9-11- 2020న ఒక రింగ్‌రోడ్డు కావాలని ప్రతిపాదనలు ఇచ్చామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా 23-3-2021న కేంద్రానికి ప్రతి పాదన పంపించామని, రాష్ట్రాలకు ఇచ్చే వాటాలో భూత్పూర్‌- చించోళి జాతీయ రహదారి ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తే రహదారి మంజూ రైందని గుర్తు చేశారు. ఈ రోడ్డు పట్టణం నుంచి పోతే ఇతర ప్రాంతా లకు ఉపయోగం ఉండదని,  2010 మాస్టర్‌ప్లాన్‌ రోడ్డుకు అనుసంధానం చేస్తే వెనకబడిన వీరన్నపేట, టీడీగుట్ట ప్రాంతమంతా అభివృద్ది చెంద డంతోపాటు పట్టణానికి 70 శాతం మణిహారంలా రింగ్‌రోడ్డు ఏర్పడు తుందని తెలిపారు. ఎప్పటికైనా మాస్టర్‌ప్లాన్‌ వరకు రోడ్డు అలానే ఉం టుందని స్పష్టం చేశారు. ఇక్కడ ఇన్నేళ్ళుగా రోడ్డు పడనందుకు పరిహా రం ఇవ్వలేదని, మాస్టర్‌ప్లాన్‌ రోడ్డులో భూమి కోల్పోయిన వారికి  నష్ట పరిహారం ఇస్తామని, ఇండ్లు కోల్పోతే డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇస్తామని, రోడ్డు అయితే ఈ ప్రాంతమంతా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎవరికీ నష్టం జరగకుండా అందరికీ నూటికి నూరు శాతం  న్యాయం చేసిన తరువాతనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.  రింగ్‌ రోడ్డు అయిన తరువాత ఒక మంచి పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో ఇక్కడ మంత్రులుగా ఉన్నవారు ఇక్కడికి వచ్చిన బైపాస్‌ను తమ ప్రాంతానికి తరలించారని విమర్శించారు.

Updated Date - 2022-01-26T05:54:29+05:30 IST