బలపరీక్షలో నెగ్గిన మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌

ABN , First Publish Date - 2020-08-11T08:09:34+05:30 IST

మణిపూర్‌ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆ రాష్ట్ర సీఎం ఎన్‌.బీరేన్‌ సింగ్‌ నెగ్గారు. బలపరీక్ష కోసం ప్రత్యేకంగా సోమవారం అసెంబ్లీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో విశ్వాసం పొందేందుకు బీరేన్‌ సింగ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు...

బలపరీక్షలో నెగ్గిన మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌

  • మూజువాణి ఓటుతో గెలుపు

ఇంఫాల్‌, ఆగస్టు 10: మణిపూర్‌ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆ రాష్ట్ర సీఎం ఎన్‌.బీరేన్‌ సింగ్‌ నెగ్గారు. బలపరీక్ష కోసం ప్రత్యేకంగా సోమవారం  అసెంబ్లీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో విశ్వాసం పొందేందుకు బీరేన్‌ సింగ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో బలపరీక్ష పూర్తైంది.  ఎన్‌.బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు గెలుపొందింది. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తమ అవిశ్వాస తీర్మా నాన్ని స్పీకర్‌ స్వీకరించలేదంటూ ఆయన వైపునకు కాంగ్రెస్‌ సభ్యులు కుర్చీ లు విసిరేశారు.


స్పీకర్‌కు మద్దతు తెలుపుతూ బీరేన్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. తాము మూజువాణి ఓటుతో గెలిచామని, స్పీకర్‌ నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. మణిపూర్‌లో బీజేపీ మిత్రపక్షం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు జూన్‌లో ప్రకటించడంతో రాజకీయ సంక్షోభం కొనసాగింది. చివరకు ఎన్‌పీపీ నేతలు మళ్లీ బీజేపీకి మద్దతిచ్చారు. 


Updated Date - 2020-08-11T08:09:34+05:30 IST