Abn logo
Mar 30 2021 @ 17:16PM

ప్రియమణి, సమంతల గురించి మనోజ్ చెప్పిన ఆసక్తికర విషయాలు

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ ఉత్తమ నటుడు అవార్డు విజేత మనోజ్ బాజ్ పాయ్‌తో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ ప్రకటన వచ్చేసరికి తాను నిద్రలో ఉన్నానని తెలిపారు. అవార్డుకు ఎంపిక అవుతానని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు కూడా ఎన్నో చిత్రాలు చేశానని, కానీ ఈ చిత్రానికి వచ్చిందని అన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో వాళ్లతో సరదాగా గడిపానని చెప్పారు. 


ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ గురించి మాట్లాడుతూ.. ప్రియమణి అందమైన హీరోయిన్ మాత్రమే కాదని.. గొప్ప టాలెంట్ ఆమె సొంతమన్నారు. ఆమెను పెళ్లి చేసుకున్నందుకు ముస్తఫా రాజ్ అదృష్టవంతుడని ప్రశంసించారు. ప్రియమణి ఇప్పుడు తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. ఆ సిరీస్ సీజన్-2లో నటిస్తున్న సమంత సరదాగా ఉంటుందని, బిగ్ స్టార్‌లా ఫీలవ్వదని, చాలా సింపుల్‌గా ఉంటుందన్నారు. ఎప్పుడూ నవ్వుతూ.. నవ్విస్తూ.. సెట్‌లో సందడి చేస్తుందన్నారు. ప్రియమణికి చాలా భాషలు తెలుసని, సమంత హిందీ నేర్చుకుంటుందన్నారు.   పూర్తి వివరాలు వీడియోలో చూడగలరు.  

Advertisement

తారలతో ముచ్చట్లుమరిన్ని...

Advertisement
Advertisement