Abn logo
May 21 2020 @ 09:49AM

ఎన్టీయార్‌ను వదిలెయ్ అన్నో.. అంటూ వర్మకు మనోజ్ ట్వీట్!

`ఆ బాడీ ఎంట్రా నాయనా` అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ సిక్స్‌ప్యాక్ బాడీ గురించి తనదైన శైలిలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా వర్మ మరో ట్వీట్ చేశాడు. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో ప్రస్తుతం `క్లైమాక్స్` సినిమా చేస్తున్న వర్మ.. ఎన్టీయార్ బాడీని ఆమెతో పోల్చాడు. 


`మియా మాల్కోవా తర్వాత నేను చూసిన సెక్సీ బాడీ ఇదే` అంటూ ఎన్టీయార్ ఫొటోను వర్మ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన మంచు హీరో మనోజ్ అవాక్కయ్యాడు. `మా వాడిని వదిలెయ్ అన్నో..` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Advertisement
Advertisement
Advertisement