మెనోపాజ్‌ మీద పైచేయి!

ABN , First Publish Date - 2021-08-03T16:27:57+05:30 IST

వేడి ఆవిర్లు, నిస్సత్తువ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్‌... మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలివి. అయితే డాన్స్‌తో ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఓ అధ్యయనంలో తేలింది.

మెనోపాజ్‌ మీద పైచేయి!

ఆంధ్రజ్యోతి(03-08-2021)

వేడి ఆవిర్లు, నిస్సత్తువ, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్‌... మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలివి. అయితే డాన్స్‌తో ఈ సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. 


ది జర్నల్‌ ఆఫ్‌ ది నార్త్‌ అమెరికన్‌ మెనోపాజ్‌ సొసైటీలో ఈ అంశానికి సంబంధించిన ఫలితాలను ప్రచురించారు. మెనోపాజ్‌ తర్వాత మహిళల మొండెం భాగంలో కొవ్వు పేరుకుపోవడం, మెటబాలిజం తగ్గిపోవడం, ట్రైగ్లిజరైడ్స్‌, చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోవడం మొదలైన మార్పులు శరీరంలో చోటు చేసుకుంటాయి. వీటి వల్ల మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలు ఆత్మన్యూనతకు లోనవుతూ, మానసిక కుంగుబాటుకు గురవుతూ ఉంటారు. అయితే శారీరక వ్యాయామం మెనోపాజ్‌తో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలను కొంత మేరకు పరిష్కరిస్తుంది.


బాడీ కాంపొజిషన్‌, మెటబాలిక్‌ ప్రొఫైల్‌, ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌, సెల్ఫ్‌ ఇమేజ్‌/సెల్ఫ్‌ ఎస్టీమ్‌ మొదలైన మెనోపాజ్‌ మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను డాన్స్‌తో అధిగమించవచ్చని అధ్యయనంలో తేలింది. డాన్స్‌ అనేది సంతోషాన్ని, ఆహ్లాదాన్ని అందించే చర్య. అలాగే తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదాలతో ఎవరికి వారు స్వయంగా సాధన చేసే వీలున్న వ్యాయామం. కాబట్టి మెనోపాజ్‌ మహిళలు దైనందిన జీవితంలో డాన్స్‌కు చోటు కల్పించాలి. డాన్స్‌తో శరీర బరువు అదుపులో ఉండడంతో పాటు, మానసికోల్లాసం దక్కుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మన్యూనత తొలగి, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అధ్యయనకారులు అంటున్నారు.



Updated Date - 2021-08-03T16:27:57+05:30 IST