మెట్రోరైల్లో కరోనావైరస్ ఉందంటూ చిలిపిచేష్టలు చేసిన యువకుడికి ఐదేళ్ల జైలు

ABN , First Publish Date - 2020-02-12T18:00:21+05:30 IST

తనకు కరోనా వైరస్ సోకిందంటూ మాస్క్ ధరించి మెట్రో రైలులో చిలిపి చేష్టలు చేసి ప్రయాణికులను భయందోళనలకు గురిచేసిన ఓ యువకుడికి రష్యా దేశ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన....

మెట్రోరైల్లో కరోనావైరస్ ఉందంటూ చిలిపిచేష్టలు చేసిన యువకుడికి ఐదేళ్ల జైలు

మాస్కో (రష్యా): తనకు కరోనా వైరస్ సోకిందంటూ మాస్క్ ధరించి మెట్రో రైలులో చిలిపి చేష్టలు చేసి ప్రయాణికులను భయందోళనలకు గురిచేసిన ఓ యువకుడికి రష్యా దేశ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన మాస్కో నగరంలో వెలుగుచూసింది. తజికిస్థాన్ దేశానికి చెందిన కరోమాతుల్లో జాబోరోవ్ అనే యువకుడు రష్యా దేశంలోని మాస్కో నగరంలో మెట్రో రైలెక్కాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తనకు ఉన్నట్లు ప్రకటించడంతోపాటు ముఖానికి మాస్క్ ధరించి కింద పడిపోయి కొట్టుకుంటూ మెట్రోరైలులోని ప్రయాణికులను భయాందోళనలకు గురిచేశాడు. ఇతనికి నిజంగా కరోనా వైరస్ సోకిందేమోనని మెట్రోరైలులోని ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ చిలిపి చేష్టలన్నీ తన స్నేహితుడితో వీడియో తీయించి కరోనా ఫ్రాంక్ పేరిట తన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో షేర్ చేశాడు.

మెట్రోరైల్లో చిలిపి చేష్టలు చేసిన కరోనా వైరస్ పై ప్రజలను భయాందోళనలకు గురిచేసిన కరోమాతుల్లోను మాస్కో పోలీసులు అరెస్టు చేసి అతన్ని కోర్టులో హాజరు పర్చారు. కరోనా వైరస్ గురించి ప్రయాణికుల్లో అవగాహన పెంచడానికే కరోమాతుల్లో చిలిపి పని చేశాడని అతని తరపు న్యాయవాది అలెక్సీ కోర్టులో వాదించాడు. యువకుడు చేసిన చిలిపి పనికి ఆగ్రహించిన కోర్టు జడ్జి దోషి అయిన కరోమాతుల్లోకు ఐదేళ్ల కారాగార శిక్ష విధించారు. దీంతో అతన్నిపోలీసులు జైలుకు తరలించారు.


ఛద్ద్ సిన్సిలేర్ సౌజన్యంతో వీడియోను ఓ లుక్కేయండి..

Updated Date - 2020-02-12T18:00:21+05:30 IST