మంతనాలమ్మను దర్శించుకున్న మంత్రి సురేష్‌

ABN , First Publish Date - 2021-08-02T05:38:10+05:30 IST

మండలంలోని నల్లమల అటవీ ప్రాంతం పెద్ద మంతనాల గిరిజన గ్రామంలో వెలసిన మంతనాలమ్మ అ మ్మవారికి మంత్రి ఆదిమూలపు సురేష్‌ఆది వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంతనాలమ్మను దర్శించుకున్న మంత్రి సురేష్‌
అమ్మవారికి పూజలు చేస్తున్న మంత్రి సురేష్‌

పెద్ద దోర్నాల, ఆగస్టు 1 : మండలంలోని నల్లమల అటవీ ప్రాంతం పెద్ద మంతనాల గిరిజన గ్రామంలో వెలసిన మంతనాలమ్మ అ మ్మవారికి మంత్రి ఆదిమూలపు సురేష్‌ఆది వారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవం పెద్ద మంతనాల అమ్మవా రిని కొలిచిన వారికి కొంగుబంగారమని అక్కడి ప్రజల నమ్మకం. చెంచు గిరిజనులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తమ కోరికలు నెరవేర్చాలంటూ మొక్కుకుంటారు. ఆదివారం మొ క్కులు తీర్చుకుంటారు. దీంతో ప్రతి ఆదివారం ఇక్కడ పండుగ వాతావరణం కన్పిస్తుంది.  దోర్నాలకు చెందిన వైసీపీ నాయకుడు గంటా గురవారెడ్డి మొక్కు తీర్చుకునేక్రమంలో  ము ఖ్యఅతిథులుగా మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బాల మురళీకృష్ణ హాజరయ్యారు. సకాలంలో వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని అమ్మవారిని సేవించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు ఏగిరెడ్డి, నాయకులు షేక్‌ అబ్దుల్‌ మజీద్‌, గం టా రమణారెడ్డి, లింగారెడ్డి, జోగి వెంకటనారాయణ లక్ష్మీరెడ్డి, చిన్నగుడిపాడు సర్పంచి పవన్‌కుమార్‌, బాలకాశయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-08-02T05:38:10+05:30 IST