Abn logo
Sep 26 2021 @ 15:07PM

చాలా జిల్లాల్లో బ్యాంకు శాఖలు లేవు : నిర్మల సీతారామన్

ముంబై : మన దేశంలోని చాలా జిల్లాల్లో బ్యాంకుల శాఖలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. ఆయా జిల్లాల్లో అత్యధిక స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ బ్యాంకుల శాఖలు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నిర్వహించిన కార్యక్రమంలో ఆదివారం ఆమె మాట్లాడారు. 


బ్యాంకు శాఖలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిని పెంచాలని నిర్మల పిలుపునిచ్చారు. డిజిటైజేషన్‌కు తాను వ్యతిరేకం కాదన్నారు. బ్రిక్ అండ్ మోర్టార్ మోడల్‌లో బ్యాంకుల శాఖలు ఎక్కడ అవసరమో నిర్ణయించాలని బ్యాంకర్లను కోరారు. 


ఇప్పుడు బ్యాంకుల పుస్తకాలు చాలా స్పష్టంగా ఉన్నాయని, ఇది ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పారు. రీక్యాపిటలైజేషన్ అవసరాలు తగ్గుతాయన్నారు. త్వరలో రాబోతున్న నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీని అమెరికాలో పిలిచినట్లుగా బ్యాడ్ బ్యాంక్ అని పిలువకూడదని తెలిపారు.