ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ

ABN , First Publish Date - 2020-02-22T21:13:18+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు ఎదురు దెబ్బ తెగిలింది. సుక్మా జిల్లాలో భారీ  ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సాల్పవాడ్‌ అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా  ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ చేపట్టారు. ఆపరేషన్‌లో  సుమారు 1500 మంది డీఆర్జీ బలగాలు, 500 మంది కోబ్రా బెటాలియన్‌ జవాన్లు పాల్గొన్నట్లు తెలుస్తోంది. బడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో 30 గంటల పాటు ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ కొనసాగింది.  సాల్పవాడ్‌ అటవీ ప్రాంతంలో భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలంలో మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా భద్రతా బలగాలు బృందాలుగా దండకారణ్యంలో సుమారు 30 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోయి సెర్చ్‌ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిసింది.

Updated Date - 2020-02-22T21:13:18+05:30 IST