Abn logo
Aug 2 2021 @ 02:36AM

చర్ల అడవుల్లో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి

చర్ల, అగస్టు 1: తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా చర్ల అడవుల్లో ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. అతడి మృతదేహం వద్ద ఒక 303 రైఫిల్‌, రెండు కిట్‌ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లోని ఆవుపల్లి మండలం రేఖపల్లి గ్రామానికి చెందిన మిలీషియా సభ్యుడిని చర్ల మండలం దానవాయిపేట గ్రామ శివారులో చర్ల పోలీసులు అరెస్టు చేశారు.