రాష్ట్రం నుంచి మావోయిస్టులను తరిమేశాం: జితేందర్‌

ABN , First Publish Date - 2020-02-28T11:39:10+05:30 IST

రాష్ట్రం నుం చి మావోయిస్టులను పూర్తిగా తరిమేశామని, ఎక్కడ వారికి ప్రజలు మద్దతుగానీ, సానుభూతి గానీ లేదని అడిషనల్‌ డీజీ లాఅండ్‌ ఆర్డర్‌ జితేందర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రం నుంచి మావోయిస్టులను తరిమేశాం: జితేందర్‌

గోదావరిఖని, ఫిబ్రవరి 27: రాష్ట్రం నుంచి మావోయిస్టులను పూర్తిగా తరిమేశామని, ఎక్కడ వారికి ప్రజలు మద్దతుగానీ, సానుభూతి గానీ లేదని అడిషనల్‌ డీజీ లాఅండ్‌ ఆర్డర్‌ జితేందర్‌ పేర్కొన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగా ల్లో అభివృద్ధి చెందుతుందని, నక్సలిజమనే మాటకే అవకాశం లేదన్నారు. అడపాదడపా ఉనికి కోసం ఇతర రాష్ర్టాల నుంచి ప్రయత్నిస్తున్నారని, పోలీసు శాఖ ధీటుగా సమాధానం ఇవ్వడమే కాకుండా అడుగుపెట్టనివ్వడం లేదన్నారు. ఈ ఏడాదిని రాష్ట్ర పోలీస్‌శాఖ మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ ను లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టామన్నారు. రోడ్డు భద్రత విషయంలో బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి ఇంజనీరిం గ్‌ లోపాలను సరిచేసేందుకు నేషనల్‌ రోడ్‌ ఆథారిటీతో సంప్రదిస్తున్నామన్నారు. ఇప్పటికే ఒకసారి సమావేశాలు నిర్వహించామని 44 బ్లాక్‌ స్పాట్‌లుగాను 20 సరిచేశామన్నారు. మరో 10పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని వివిధ చోట్ల 171 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించామన్నారు. ఇందులో వివిధ శాఖలకు సంబంధించి సమన్వయం జరుగుతుందన్నా రు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో పోలీసు శాఖ సమన్వయం చేస్తుందని చెప్పారు. మున్సిపల్‌శాఖ ఇప్పటికే రోడ్డు భద్రతా అంశాలను కూడా రోడ్డు నిర్మాణ అం చనాలలో చేర్చాలని మున్సిపల్‌ శాఖ జీవో జారీ చేసిందన్నారు. ప్రమాదాల నివారణకు మరింత మెరుగైన చర్యలు చేపట్టేందుకు పోలీస్‌ శాఖ ప్రయత్నిస్తుందన్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్యూట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.రామగుండంలో భరోసా కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతామన్నారు. దీని తో పాటు చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. పటాన్‌చెరు ఘటన దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. విలేకరుల సమావేశంలో కరీంనగర్‌, వరంగల్‌ రేంజ్‌ ఇంచార్జ్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌, రామగుండం పోలీస్‌కమిషనర్‌, డీఐజీ సత్యనారాయణ, పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు రవీందర్‌, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ట్రైనీ ఐపీఎస్‌ రూపేష్‌, అడిషనల్‌ డీసీపీఅడ్మిన్‌ అశోక్‌కుమార్‌, అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ సంజీవ్‌, ఏసీపీలు ఉమేందర్‌, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:39:10+05:30 IST