ప్రాంతీయ భాషల్లో మ్యాప్స్‌

ABN , First Publish Date - 2021-01-30T05:40:59+05:30 IST

గూగుల్‌ మ్యాప్స్‌ పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆటోమేటిక్‌ ట్రాన్స్‌లేషన్‌ పద్ధతిలో ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది.

ప్రాంతీయ భాషల్లో మ్యాప్స్‌

గూగుల్‌ మ్యాప్స్‌ పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆటోమేటిక్‌ ట్రాన్స్‌లేషన్‌ పద్ధతిలో ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. తెలుగుకు తోడు బంగ్లా, గుజరాతీ, హిందీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ భాషల్లో ఈ సదుపాయం ఉంటుంది. అనువాదానికి భిన్నంగా ట్రాన్స్‌లిటరేషన్‌ ఉంటుంది. అవే పదాలను వేరే స్ర్కిప్ట్‌లో రాయడం ద్వారా మాతృభాషలో ఫలితాన్ని పొందవచ్చు.


అందుకు అనుగుణ్యమైన లెర్నింగ్‌ మోడల్స్‌ను గూగుల్‌ అభివృద్ధి చేసింది. ఇంగ్లీష్‌ మాట్లాడటం రాని భారతీయుల కోసం దీన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఇంతకుమునుపుతో పోల్చుకుంటే మాతృభాష మాత్రమే తెలిసిన వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగకరం. త్వరలో పర్షియా- అరబిక్‌ స్ర్కిప్ట్‌లు సహా మరిన్ని భాషలకు ఈ సదుపాయాలను విస్తరించే యోచనలో గూగుల్‌ ఉంది. 


Read more