Abn logo
Oct 5 2021 @ 11:17AM

తెలంగాణలో రెచ్చిపోతున్న గంజాయి మాఫియా

హైదరాబాద్: తెలంగాణలో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో గంజాయి ముఠాలు చెలరేగుతున్నాయి. మరోవైపు పోలీసులు నిఘా పెంచి గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.


ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పిన అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్నారు. 65వ జాతీయ రహదారిపై పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతోంది. ఖాకీల కళ్లుగప్పి రూటు మార్చిన స్మగ్లర్లు.. ఆర్టీసీ బస్సులను అక్రమరవాణాకు వినియోగించుకుంటున్నారు. దీంతో పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లతో ముఠాలకు షాక్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption