Marijuana విక్రయిస్తున్న తల్లికొడుడుకు అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-09T12:20:37+05:30 IST

అంబాభవానీ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న తల్లికొడుకును అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. ఆయన వివరాల మేరకు... అంబాభవానీ నగర్‌కు చెందిన ఆవాల

Marijuana విక్రయిస్తున్న తల్లికొడుడుకు అరెస్ట్

కడప: అంబాభవానీ నగర్‌లో గంజాయి విక్రయిస్తున్న తల్లికొడుకును అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. ఆయన వివరాల మేరకు... అంబాభవానీ నగర్‌కు చెందిన ఆవాల ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు రెడ్డెయ్య గంజాయి తీసుకొచ్చి వాటిని పొట్లాలుగా మార్చి పేదలకు, యువకులకు విక్రయిస్తుండేవారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి సూచనల మేరకు ఎస్‌ఐ హుస్సేన్‌ సిబ్బందితో దాడులు చేసి ఇరువురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 410 గ్రాముల గంజాయి, 400 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Updated Date - 2021-11-09T12:20:37+05:30 IST