Abn logo
Jun 7 2021 @ 19:06PM

గంజాయి పట్టివేత

భద్రాద్రి: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం డీఆర్‌పీఎఫ్‌ క్యాంప్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా నుంచి మిర్యాలగూడకు కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ దాదాపు 30 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

క్రైమ్ మరిన్ని...