Abn logo
Aug 23 2021 @ 18:35PM

గంజాయి పట్టివేత

భద్రాద్రి: జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద  వాహన తనిఖీలు చేపట్టారు. ఈ  తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నారు. అలాగే వేర్వేరుగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను, ఒక బాల నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. దాదాపుగా 110 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేసారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు 22 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక కారు, ట్రాలీ, ఆటోలను పోలీసులు సీజ్ చేసారు.