Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్కాపురం కిడ్నాప్ కథా సుఖాంతం

ప్రకాశం: మార్కాపురంలో కిడ్నాపర్లను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితులు రెహానా, హాలీమా, రహమతున్నీసాను అరెస్ట్ చేశారు. చిన్నారి కిడ్నాప్‌ కేసును 10 గంటల్లోనే ఛేదించామని ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు. పాపను అమ్మేందుకు రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించామని మలికా గార్గ్‌ చెప్పారు. చిన్నారి కిడ్నాప్‌ వ్యవహారంలో విధుల పట్ల నిర్లక్ష్యగా వ్యవహరించిన నలుగురు నర్సులకు జిల్లా వైద్యశాల పర్యవేక్షణాధికారి రవీంద్ర మోమోలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని నివేదిక అందిచాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement