అడ్తిదారులకు కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2021-10-13T05:07:26+05:30 IST

అడ్తిదారులకు కుచ్చుటోపీ

అడ్తిదారులకు కుచ్చుటోపీ
మిర్చి యార్డు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అడ్తిదారులు

వరంగల్‌ టౌన్‌, అక్టోబరు 12: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓ మిర్చి వ్యాపారులు..  అడ్తిదారుల నుంచి రూ.10కోట్ల మేరకు మిర్చి కొనుగోలు చేసి,  డబ్బులు ఇవ్వకుండా ఉడాయించిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. అడ్తిదారుల కథనం ప్రకారం.. పదేళ్లుగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ యజమానులు బిల్లా నాగేందర్‌, బిల్లా యుగంధర్‌ (అన్నదమ్ము లు) రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన మిర్చిని అడ్తిదారుల ద్వారా కొనుగోలు చే స్తున్నారు.అడ్తిదారులకు 15రోజుల నుంచి నెల రోజుల్లో డబ్బులు చెల్లించేవారు. గత ఆరు నెలల నుంచి అడ్తిదారుల ద్వారా పెద్ద మొత్తంలో మిర్చి కొనుగోలు చేసి, కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేశారు. కొంత మిర్చిని ఇతర రాష్ర్టాలకు తరలించారు. కొవిడ్‌ నేపథ్యంలో చెల్లింపులునిలిచిపోయాయి. దీంతో మిర్చి వ్యాపారులు అడ్తిదారులకు చెలిం పులు చేయకపోవడంతో వారు రైతులకు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తాయి. సు మారు రూ.10కోట్ల మేరకు బకాయిలు పడడంతో అడ్తిదారులు మిర్చి వ్యాపారులకు ఫోన్లు చేయగా స్విచ్ఛాఫ్‌ చేశారు. ఆందోళన చెందిన అడ్తిదారులు మిర్చి వ్యాపారుల నివాసాల వద్దకు వెళ్లగా వారి ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. ఇదే విషయాన్ని అడ్తిదారులు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. చాంబర్‌ ప్రతినిధులు మా ర్కెట్‌ కార్యదర్శికి, మార్కెటింగ్‌శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి అడ్తిదారుల కు న్యాయం చేయాలని కోరారు.

అడ్తిదారుల ఆందోళన 

నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ మోసాన్ని అడ్తిదారులు మంగళవారం  చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌ రెడ్డి ఇతర ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అడ్తిదారులతో కలిసి మార్కెట్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. దీంతో మార్కెట్లో పత్తి, మిర్చి, పల్లితోపాటు అన్ని రకాల సరుకుల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. మార్కెట్‌ చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి, మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌, కమిటీ డైరెక్టర్‌లు కంది రవీందర్‌ రెడ్డి, వెంకట్రావు తదితరులు ఆందోళన చేస్తున్న అడ్తిదారుల వద్దకు వెళ్లి మిర్చి వ్యాపారిపై చర్యలు తీసుకుంటామని  నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మార్కెటింగ్‌శాఖ  డీఎంవో ప్రసాద్‌రావు చేరుకుని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా చాంబర్‌ అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డితో మాట్లాడి నాగేంద్ర ట్రేడింగ్‌ కంపెనీ పై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పడంతో ఆందోళన విరమించారు. 



Updated Date - 2021-10-13T05:07:26+05:30 IST