ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1.90 లక్షల కోట్లు జంప్...

ABN , First Publish Date - 2020-11-16T02:12:19+05:30 IST

టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా ఎగసింది. బజాజ్ ఫైనాన్స్‌లో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులకు మొగ్గు చూపారు. 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1,90,571.55 కోట్లు పెరిగింది. మార్కెట్‌క్యాప్‌పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మార్కెట్ క్యాప్ కిందటి వారం తగ్గింది.

ఎనిమిది కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1.90 లక్షల కోట్లు జంప్...

ముంబై : టాప్ 10 కంపెనీల్లోని ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా ఎగసింది. బజాజ్ ఫైనాన్స్‌లో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులకు మొగ్గు చూపారు. 8 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1,90,571.55 కోట్లు పెరిగింది. మార్కెట్‌క్యాప్‌పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ మార్కెట్ క్యాప్ కిందటి వారం తగ్గింది. మిగతా సంస్థల స్టాక్స్ పెరిగాయి. హిందూస్తాన్ యూనీ లీవర్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్ లాభపడ్డవాటిలో ముందున్నాయి. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 35,878.56 కోట్లు పెరిగి రూ. 2,63,538.56 కోట్లను తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 31,989.44 కోట్లు పెరిగి రూ.4,15,761.38 కోట్లకు చేరింది. 


ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 30,142.34 కోట్లు పెరిగి రూ.3,35,771.38 కోట్లకు చేరుకుంది. హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ. 22,156.31 కోట్లు ఎగసి రూ. 5,14,223.88 కోట్లకు చేరుకుంది. భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ రూ. 17,266.84 కోట్లు పెరిగి రూ. 2,62,630.53 కోట్లకు చేరుకుంది. 


మహీంద్ర బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 10,520.48 కోట్లు పెరిగి రూ. 3,50,501.27 కోట్లకు చేరుకుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 8,540.12 కోట్లు పెరిగి రూ. 4,82,783.05 కోట్లుగా ఉంది. మరోవైపు, రిలయన్స్, టీసీఎస్ సంస్థల మార్కెట్ క్యాప్ తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.1 8,392.74 కోట్లు తగ్గి రూ. 13,53,624.69 కోట్లకు పడిపోయింది. టీసీఎస్ ఎంక్యాప్ రూ. 14,090.21 క్షీణించి రూ. 10,02,149.38 కోట్లుగా ఉంది. 


అత్యంత విలువైన కంపెనీలు... గతవారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 1745 పాయింట్లు(4.16 శాతం) లాభపడింది. టాప్ 10 మోస్ట్ వ్యాల్యుబల్ కంపెనీల్లో వరుసగా రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, కొటక్ మహీంద్ర బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్ ఉన్నాయి.


Updated Date - 2020-11-16T02:12:19+05:30 IST