రూ. 5 లక్షల కోట్లు ఎగబాకిన ఆ కంపెనీల మార్కెట్ క్యాప్...

ABN , First Publish Date - 2021-03-07T23:43:40+05:30 IST

టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 5 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు వారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే.

రూ. 5 లక్షల కోట్లు ఎగబాకిన ఆ కంపెనీల మార్కెట్ క్యాప్...

ముంబై : టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ. 5 లక్షల కోట్లు పెరిగింది. అంతకుముందు వారం మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. వరుసగా ఆరు సెషన్లలో నష్టపోవడంతో అప్పుడు రూ. 3.96 లక్షల కోట్లు నష్టపోగా. గతవారం మాత్రం భారీగా లాభపడింది. బడ్జెట్ నేపధ్యంలో వరుసగా ఐదు సెషన్లు మార్కెట్ లాభపడింది. దీంతో సెన్సెక్స్ 46 వేల పాయింట్ల నుండి 51 వేల పాయింట్ల సమీపానికి ఎగబాకింది. గతవారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్‌తో పాటు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్లకు చేరుకుంది.


టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 5,13,532.5 కోట్లు పెరిగింది. ప్రధానంగా బ్యాంకింగ్‌రంగ షేర్లు భారీగా ఎగిసాయి. గతవారం సెన్సెక్స్ 4,445.86 పాయింట్లు లేదా 9.60 శాతం మేర లాభపడిన విషయం తెలిసిందే. గతవారం భారీగా లాభపడిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉంది. ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఉంది.


బ్యాంకింగ్ స్టాక్స్ జంప్...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,13,516.92 కోట్లు పెరిగి రూ. 8,79,735.51 కోట్లకు చేరుకుంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్కెట్ క్యాప్ రూ. 99,063.86 కోట్లు పెరిగి రూ. 3,50,781.86 కోట్లకు చేరుకుంది. ఎస్‌బీఐ షేర్లు చివరి సెషన్లో ఏకంగా 11 శాతానికి పైగా ఎగిసాయి. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ. 61,836.61 పెరిగి రూ. 4,89,877.33 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ I బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 53,606.61 కోట్లు ఎగసి రూ. 4,24,379.96 కోట్లకు చేరుకుంది. కొటక్ మహీంద్రా బ్యాంకు రూ. 53,395.91 కోట్లు పెరిగి రూ. 3,92,741.04 కోట్లకు చేరుకుంది.


ఇవీ జంప్...


రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంపద రూ. 51,254.37 కోట్లు పెరిగి రూ. 12,19,708.39 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ రూ. 48,375.71 కోట్లకు పెరిగి రూ. 3,33,758.06 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ. 16,942.01 కోట్లు పెరిగి రూ. 11,85,021.85 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 13,907.56 కోట్లు పెరిగి రూ. 5,41,947.58 కోట్లకు చేరుకుంది. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ. 1,632.94 కోట్లు పెరిగి రూ. 5,33,431.50 కోట్లకు పెరిగింది.


టాప్ 10 కంపెనీలు వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉన్నాయి.

Updated Date - 2021-03-07T23:43:40+05:30 IST