వారాంతంలో లాభాల స్వీకరణ -మార్కెట్‌ రివ్యూ

ABN , First Publish Date - 2021-09-18T07:04:54+05:30 IST

స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్ఠాలను తాకిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు...

వారాంతంలో లాభాల స్వీకరణ -మార్కెట్‌ రివ్యూ

  • మూడు రోజుల ర్యాలీకి బ్రేక్‌ 

ముంబై: స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి అడ్డుకట్ట పడింది. వారాంతం ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్ఠాలను తాకిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. చివరికి స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నాయి. శుక్రవారం ప్రారంభ సెషన్‌లో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 59,737.32 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠ రికార్డును నమోదు చేసుకుంది. ఆ తర్వాత మదుపర్లు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీ 125.27 పాయింట్ల నష్టంతో 59,015.89 వద్ద క్లోజైంది. మొత్తం సెషన్‌లో సెన్సెక్స్‌ 866 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ విషయానికొస్తే.. ఒక దశలో 17,792.95 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న సూచీ.. చివర్లో 44.35 పాయింట్ల నష్టంతో 17,585.15 వద్ద స్థిరపడింది.


Updated Date - 2021-09-18T07:04:54+05:30 IST