గణాంకాలే కీలకం

ABN , First Publish Date - 2020-07-13T06:01:44+05:30 IST

అంతర్జాతీయ సంకేతాలతో గత వారం మార్కె ట్లు సానుకూలంగానే క్లోజయ్యాయి. ఈ వారం మార్కెట్‌ గమనాన్ని కార్పొరేట్‌ ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు నిర్ధేశించనున్నాయి...

గణాంకాలే కీలకం

అంతర్జాతీయ సంకేతాలతో గత వారం మార్కె ట్లు సానుకూలంగానే క్లోజయ్యాయి. ఈ వారం మార్కెట్‌ గమనాన్ని కార్పొరేట్‌ ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు నిర్ధేశించనున్నాయి. కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్రతరం అవుతుండటంతో మార్కెట్లు దీనిపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. డైలీ చార్టుల ప్రకారం చూస్తే నిఫ్టీ 200 ఎస్‌ఎంఏ వద్దకు చేరుకుంది. ఇక్కడ గట్టి పరీక్షను ఎదుర్కొనే చాన్సుంది. నిఫ్టీ 10850 స్థాయిలను అధిగమిస్తే 11000-11200 చేరుకునే అవకాశం ఉంది. 10700- 11000 జోన్‌లో సాగితే లాభాల స్వీకరణ ఉత్తమం.


స్టాక్‌ రికమండేషన్స్‌

సన్‌టెక్‌ రియల్టీ: ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీ కరెక్షన్‌ను చవిచూసిన ఈ షేరు ఇటీవల కొద్దిగా ఆకర్షణీయంగా మారింది. సమీప భవిష్యత్తులో బ్రేకౌట్‌ పాయింట్‌ను అధిగమించే అవకాశం ఉంది. గత వారం రూ.197.25 వద్ద క్లోజైన ఈ షేరును రానున్న వారాలకు రూ.187 స్టాప్‌లా్‌సతో రూ.212 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు.  

లారస్‌ లాబ్స్‌: ఏప్రిల్‌ నుంచి ఫార్మా విభాగ షేర్లు దూకుడుగా సాగుతున్నాయి. అదే బాటలో ఈ కంపెనీ షేరు కూడా సాగుతోంది. గత శుక్రవారం రూ.597.90 వద్ద క్లోజైన ఈ షేరును వచ్చే 14 సెషన్లకు రూ.628 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.578.20 ధరను స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

 - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌: పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


Updated Date - 2020-07-13T06:01:44+05:30 IST