Stock Market : మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ అకౌంట్లలోకి రూ.9 లక్షల కోట్లు..

ABN , First Publish Date - 2022-07-30T15:59:43+05:30 IST

మూడు రోజులపాటు భారత స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో బుల్స్ రాజ్యమేలడంతో ఇన్వెస్టర్స్ అకౌంట్లలో..

Stock Market : మూడు రోజుల్లో ఇన్వెస్టర్స్ అకౌంట్లలోకి రూ.9 లక్షల కోట్లు..

Stock Market : మూడు రోజులపాటు భారత స్టాక్ మార్కెట్ల(Stock Markets)లో బుల్స్ రాజ్యమేలడంతో ఇన్వెస్టర్స్ అకౌంట్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా డబ్బు వచ్చి చేరింది. మెటల్(Metal), బ్యాంకింగ్(Banking), ఎనర్జీ స్టాక్స్(Energy stocks) కొనుగోళ్లలో దుమ్మురేపడంతో 30-షేర్ల బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్( BSE benchmark Sensex) 712.46 పాయింట్లు లేదా 1.25% పెరిగి మూడు నెలల గరిష్ట స్థాయి 57,570.25 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్ల(Equity markets)లో ఇది వరుసగా మూడో రోజు ర్యాలీ. 


సెన్సెక్స్ గురువారం 1041.47 పాయింట్లు లేదా 1.87% లాభపడింది. మూడు రోజుల్లో బెంచ్‌మార్క్(Benchmark) 2,301.76 పాయింట్లు లేదా 4.16% పెరిగింది. బీఎస్‌ఈ-లిస్టెడ్ సంస్థల(BSE-listed firms) మార్కెట్ క్యాపిటలైజేషన్‌(Market Capitalisation)కు రూ.9,03,574.58 కోట్లు యాడ్ అయ్యాయి. దీంతో ఇది ఇప్పుడు రూ.2,66,58,604.02 కోట్లకు చేరుకుంది. కమోడిటీ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (FII) అమ్మకాలను పెద్ద ఎత్తున తగ్గించడం, ఆశించిన దానికంటే మెరుగైన రాబడులు రావడంతో మార్కెట్లు రికవరీకి దారితీశాయని విశ్లేషకులు తెలిపారు. 


విస్తృత మార్కెట్‌లో ఈ రోజు బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్(BSE smallcap gauge) 1.38%, మిడ్‌క్యాప్ ఇండెక్స్(midcap index) 1.01% పెరిగింది. ప్రధాన సెన్సెక్స్ లాభపడిన(major Sensex gainers) వాటిలో టాటా స్టీల్(Tata Steel), సన్ ఫార్మా(Sun Pharma), బజాజ్ ఫిన్‌సర్వ్(Bajaj Finserv), ఇండస్ఇండ్ బ్యాంక్(IndusInd Bank), ఇన్ఫోసిస్(Infosys), ఏషియన్ పెయింట్స్(Asian Paints), రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries), బజాజ్ ఫైనాన్స్(Bajaj Finance) ఉన్నాయి.




Updated Date - 2022-07-30T15:59:43+05:30 IST