మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకుందాం

ABN , First Publish Date - 2021-10-21T04:37:00+05:30 IST

కూరగాయల మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మార్కెట్‌ సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎంబేటి ఏసు నాయుడు కోరడంతో మద్రాసు బస్టాండు వద్ద ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్‌, ఓపెన్‌ మార్కెట్‌ను బుధవారం జేసీ, కమిషనర్‌ పరిశీలించారు.

మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచుకుందాం
మార్కెట్‌ను పరిశీలిస్తున్న జేసీ, కమిషనర్‌, ఏఎంసీ చైర్మన్‌ తదితరులు

ఫుట్‌పాత్‌లపై కూరగాయల వ్యాపారం వద్దు

జేసీ, కమిషనర్‌

నెల్లూరు(వ్యవసాయం), అక్టోబరు 20 : కూరగాయల మార్కెట్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మార్కెట్‌ సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎంబేటి ఏసు నాయుడు కోరడంతో మద్రాసు బస్టాండు వద్ద ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్‌, ఓపెన్‌ మార్కెట్‌ను బుధవారం జేసీ, కమిషనర్‌ పరిశీలించారు. వ్యాపారులు నిర్దేశిత ప్రాంతాల్లో క్రమపద్ధతిలో వ్యాపారం చేసుకోవాలని సూచించారు. రోడ్డు బయట ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేయొద్దని, దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలు నెలకొంటున్నాయని చెప్పారు. వినియోగదారుల వాహనాలను మార్కెట్‌లో నిలుపుకునేందుకు స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ అధికారులకు సూచించారు. వ్యర్థాలు ఎక్కువగా ఉండే సమయంలో కార్పొరేషన్‌ వాహనాలను నామమాత్రపు అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ ఏడీ రామమ్మ, హెల్త్‌ ఆఫీసర్‌ వెంకట రమణ, ట్రాఫిక్‌ డీఎస్పీ సుబహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T04:37:00+05:30 IST