మార్కెట్‌ తరలింపునకు వ్యాపారులు నో

ABN , First Publish Date - 2020-04-05T10:30:43+05:30 IST

స్థానిక గుత్తి రోడ్డులోని మార్కెట్‌యార్డులో కూ రగాయల మార్కెట్‌ నిర్వహణకు శనివారం వ్యాపారులు ముందుకు రాలేదు.

మార్కెట్‌ తరలింపునకు వ్యాపారులు నో

అనంతపురం అర్బన్‌, ఏప్రిల్‌ 4: స్థానిక గుత్తి రోడ్డులోని మార్కెట్‌యార్డులో కూ రగాయల మార్కెట్‌ నిర్వహణకు శనివారం వ్యాపారులు ముందుకు రాలేదు. పా తవూరు మార్కెట్‌నయితే మూసివేశారు కానీ దాన్ని తరలించేందు కు మాత్రం వారు అంగీకరించకపోవడం గమనార్హం. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సమయం సడలించిన విషయం తెలిసిందే.


అయితే నగరంలోని పాతవూరు కూరగాయల మార్కెట్‌లో ప్రజలు గుంపులు గుంపులుగా వెళు తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలకు తిలోదకాలిస్తూ వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యే లా వ్యవహరిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందుకు స్పందించిన అధికారులు ఆ కూరగాయల మార్కెట్‌ను శనివారం నుంచి గుత్తిరోడ్డులోని మార్కెట్‌యార్డులో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. అయితే మార్కెట్‌ సంఘం నాయకులు, వ్యాపారులు అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ శనివారం కూరగాయల మార్కెట్‌ నిర్వహణకు నిరాకరించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 


చెరువు కట్టకింద నిర్వహణపై ఆసక్తి...

పాతవూరులోని కూరగాయల మార్కెట్‌లో తెల్లవారుజామున  నాలుగు గంటల వరకు హోల్‌సేల్‌ వ్యాపారాలు జరుగుతాయి. అనంతరం సాయంత్రం వరకు రీటైల్‌ వ్యాపారం కొనసాగుతుంది. నిత్యం వేలసంఖ్యంలో ప్రజలు ఈ మార్కెట్‌కు వస్తూంటారు. కరోనా నేపథ్యంలో అక్కడ మార్కెట్‌ నిర్వహించడం ప్రమాదమని అధికారులు గుర్తించి గుత్తిరోడ్డులోని మార్కెట్‌ యార్డుకు తరలివెళ్లాలని సూచించారు. అయితే వ్యాపారులు మాత్రం సరికొత్త కారణం తెరపైకి తీసుకువచ్చారు. ఆ ప్రాంతం నగర ప్రజలకు దూరమవుతుందని.. పాతవూరు చెరువు కట్టకింద నిర్వహిస్తామని ప్రతిపాదించారు.


క్కిరిసిన జనం..

మార్కెట్‌యార్డులో కాకుండా శనివారం పాతవూరు కూరగాయల మార్కెట్‌ సమీపంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మార్కెట్‌ నిర్వహించారు. దీంతో అక్కడికి ఇసుకేస్తే నేల రాలనంతగా జనం తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సాధారణంగా సడలింపు సమయం ముగిసినా సరుకు పూర్తి గా అమ్ముడుపోయేది కాదు. అలాంటిది రెండు గంటల్లోనే మొత్తం సరుకు ఊడ్చుకుపోవడం గమనార్హం. అయినా, 11 గంటల వరకు వినియోగదారులతో కిటకిటలాడింది.


స్తంభించిన ట్రాఫిక్‌..

మార్కెట్‌కు వచ్చినవారు తాడిపత్రి బస్టాండు సర్కిల్‌ నుంచి గాంధీబజార్‌ మొ త్తం తమ వాహనాలు పార్కింగ్‌  చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించింది. దాన్ని క్లియర్‌ చేయించడానికి పోలీసులు నానా అవస్థలు పడాల్సివచ్చింది.


కనిపించని అధికారుల సూచన..

కూరగాయల మార్కెట్‌ తరలింపు విషయమై అధికారులు ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించకపోవడంతో శనివారం మార్కెట్‌కు వచ్చిన ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పక్కనే కస్తూరిబా బాలికల పాఠశాలలో మార్కెట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుసుకుని అక్కడికి వారు క్యూకట్టారు. ఇలా లాక్‌డౌన్‌ నిబంధనలకు పాతరేశారు.


అధికారులతో చర్చించాం...  కే.ఆనంద్‌, అధ్యక్షుడు,  మార్కెట్‌ కమిటీ 

నగర వాసులకు గుత్తిరోడ్డులోని మార్కెట్‌యార్డు చాలా దూరంలో ఉంది. దీంతో వ్యాపారాలు సన్నగిల్లి వ్యాపారులు నష్టపోయే అవకాశముంటుంది. ఈ క్రమంలో పాతవూరులోని చెరువుకట్టకింద సర్వీస్‌ రోడ్డులో ఏర్పాటు చేసుకునేలా మార్కెట్‌ సంఘం తరపున సంబంఽధిత అధికారులతో చర్చించాం. వ్యాపారులు ఇందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా ఆదివారం నుంచి అక్కడే నిర్వహిస్తాం. 


Updated Date - 2020-04-05T10:30:43+05:30 IST