మార్కెట్‌ ఢమాల్‌!

ABN , First Publish Date - 2020-03-07T08:26:06+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు గండికొట్టింది.

మార్కెట్‌ ఢమాల్‌!

  • సెన్సెక్స్‌ 894 పాయింట్లు డౌన్‌.. 11,000 దిగువకు  నిఫ్టీ 
  • 8 బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు బేర్‌ 8 రూ.3.28 లక్షల కోట్లు ఆవిరి 
  • యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం..  ‘కరోనా’ భయాలే కారణం


ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం   ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు గండికొట్టింది. కరోనా వైరస్‌ భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తడం మన మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచింది. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎ స్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 1,459 పాయింట్ల వరకు క్షీణించింది. చివరికి 893.99 పాయింట్ల (2.32 శాతం) నష్టంతో 37,576.62 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ప్రామాణిక సూచీ నిఫ్టీ 279.55 పాయింట్లు (2.48 శాతం) కోల్పోయి 10,989.45 వద్దకు జారుకుంది. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. సంక్షోభంలోకి జారుకున్న యెస్‌ బ్యాంక్‌ షేరు విలువ ఒక్క రోజులో సగానికి పైగా తగ్గింది. బ్లూచి్‌పలతోపాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీలూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 2.36 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.92 శాతం పతనమయ్యాయి. తత్ఫలితంగా మార్కెట్‌ వర్గాల సంపద 3.28 లక్షల కోట్ల మేర తరిగిపోయి రూ.144, 31,224.41 కోట్లకు పరిమితమైంది. వారాం తం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 28 నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్‌ 6.51 శాతం క్షీణించగా.. ఎస్‌బీఐ 6.19 శాతం పతనమైంది. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 5.62 శాతం నష్టపోయింది. హెచ్‌డీఎ్‌ఫసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 3 శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. బజాజ్‌ ఆటో, మారుతి సుజుకీ మాత్రం ఒక శాతం పైగా లాభపడ్డాయి. బీఎ్‌సఈలోని అన్ని రంగాల సూచీలూ నేలచూపులు చూశాయి. మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 4.40 శాతం నష్టపోగా.. బ్యాంకెక్స్‌ 3.46 శాతం, ఫైనాన్స్‌ 3.39 శాతం, ఎనర్జీ 3.22 శాతం, రియల్టీ 3.09 శాతం జారుకున్నాయి. 


ఈ వారం నష్టాలతో సరి

వారాంతంలో సూచీలు భారీ పతనాన్ని చూడటంతో వారం మొత్తానికీ సూచీలు నష్టాలతోనే సరిపెట్టుకోవాల్సి వ చ్చింది. సెన్సెక్స్‌ 720.67, నిఫ్టీ 212.30 పాయింట్లు నష్టపోయాయి. 


ప్రపంచ మార్కెట్లు బేర్‌..!

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారుకోవచ్చన్న భయాలు పెరిగాయి. దాంతో అమెరికా, యూరప్‌ మార్కెట్‌ సూచీలు 3 శాతం పైగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్‌ సూచీలూ నష్టాల బాటలోనే పయనించాయి. 

Updated Date - 2020-03-07T08:26:06+05:30 IST