మరో ఆర్థిక ప్యాకేజీపై ఆశలు.. మళ్లీ గంతేసిన స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2020-04-09T22:24:44+05:30 IST

నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు ఇవాళ మళ్లీ నిలదొక్కుకున్నాయి. సెన్సెక్స్ ..

మరో ఆర్థిక ప్యాకేజీపై ఆశలు.. మళ్లీ గంతేసిన స్టాక్ మార్కెట్లు!

ముంబై: నిన్న స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు ఇవాళ మళ్లీ నిలదొక్కుకున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు ఎగసి మరోసారి కీలకమైన 30 వేల మార్కు దాటగా... నిఫ్టీ సైతం 9 వేల మార్కును దాటి దూసుకెళ్లింది. కోవిడ్-19 కల్లోలం నేపథ్యంలో చిన్న తరహా పరిశ్రమల కోసం కేంద్రం మరో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తుందన్న వార్తలు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,265.66 పాయింట్లు (4.23 శాతం) లాభపడి 31159.62 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 363.15 పాయింట్లు (4.15 శాతం) దూసుకెళ్లి 9111.90 వద్ద క్లోజ్ అయ్యింది.


నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, సిప్లా, టైటాన్, టాటా మోటార్స్ అత్యధిక లాభాలు నమోదు చేయగా.. హెచ్‌యూఎల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇండస్ ఇండ్ బ్యాంకు తదితర షేర్లు నష్టాలతో ముగిశాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడం కూడా దేశీయ మార్కెట్ సూచీలకు దన్నుగా నిలిచినట్టు చెబుతున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి కరోనా ప్రభావిత దేశాలు మళ్లీ తిరిగి త్వరలోనే కోలుకుంటాయని గ్లోబల్ ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.  

Updated Date - 2020-04-09T22:24:44+05:30 IST