పెళ్లి ప్రాథమిక హక్కు: కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-03T16:20:32+05:30 IST

వాజిద్ అనే యువకుడు రమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రమ్య కుటుంబీలకు దీనికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా రమ్యను బెంగళూరులోని విద్యారన్యపురలో

పెళ్లి ప్రాథమిక హక్కు: కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

బెంగళూరు: ‘‘తాము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది పౌరుల వ్యక్తిగత అభిప్రాయం.. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు’’ అని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. వజీద్ అనే వ్యక్తి వేసి హెబియాస్ కార్పస్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. ప్రేమ, పెళ్లి పేరుతో మతం మారుతున్నారనే కారణంతో అన్యమతస్థుల మధ్య వివాహ నిషేధానికి ‘లవ్ జిహాద్’ పేరుతో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.


వాజిద్ అనే యువకుడు రమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రమ్య కుటుంబీలకు దీనికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా రమ్యను బెంగళూరులోని విద్యారన్యపురలో ఉన్న మహిళా దక్షత సమితి భవనంలో బంధించారు. దీనిపై వాజిద్, హైకోర్టును ఆశ్రయించారు. ‘‘నా కోలీగ్‌ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. అయితే నా తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడమే కాకుండా నన్ను బలవంతంగా బంధించారు’’ అని హైకోర్టులో వేసిన హెబియస్ కార్పర్ పిటిషన్‌లో రమ్య స్టేట్‌మెంట్‌ను రికార్టు చేసి నివేదించారు.


దీనిపై విచారించిన కర్ణాటక హైకోర్టు.. ‘‘ఈ దేశంలో ఏ పౌరుడైనా/పౌరురాలైనా వాళ్లు ఇష్టపడే వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన స్వేచ్ఛ విషయంలో కులానికి కానీ మతానికి కానీ ప్రవేశం లేదని, ఇది ప్రాథమిక హక్కని రాజ్యాంగం చెబుతోంది’’ అని జస్టిస్ ఎస్ సుజాత, జస్టిస్ సచిన్ శంకర్ మాగడం ధర్మాసనం పేర్కొంది. అంతే కాకుండా రమ్యను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

Updated Date - 2020-12-03T16:20:32+05:30 IST