ఉరేగింపులో ఉల్లాసంగా వరుడు.. బ్యాండు మేళాన్ని అడ్డుకున్న పోలీసులు!

ABN , First Publish Date - 2020-11-26T12:54:07+05:30 IST

కొద్దిసేపట్లో పెళ్లి జరగనున్నదనే ఉత్సాహంతో ఉన్న వరునికి ఊహించని విధంగా షాక్ తగిలింది.

ఉరేగింపులో ఉల్లాసంగా వరుడు.. బ్యాండు మేళాన్ని అడ్డుకున్న పోలీసులు!

మధుర: కొద్దిసేపట్లో పెళ్లి జరగనున్నదనే ఉత్సాహంతో ఉన్న వరునికి ఊహించని విధంగా షాక్ తగిలింది. సినిమా పాటకు బ్యాండుమేళం మ్యూజిక్ వాయిస్తూ ముందు కదులుతుండగా, ఆ వెనుకగా గుర్రంపై ఊరేగింపుగా వరుడు వస్తున్నాడు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ బ్యాండుమేళం సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ హఠాత్ పరిణామానికి వరునితో పాటు బంధువులంతా నివ్వెరపోయారు.


ఈ ఉదంతం యూపీలోని మధుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కోసీకలాంలో చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశంచేసి ఊరేగింపును అడ్డుకుని, బ్యాండుమేళం సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. దీంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పెళ్లి వేడుకల విషయంలో పలు నిబంధనలు ఉన్నాయని, వాటిని తప్పని సరిగా పాటించాలని పోలీసులు వారికి తెలిపారు. వివాహ వేదిక ప్రాంగణంలోనే బ్యాండుమేళం మ్యూజిక్ వాయించాలని చెప్పారు. తరువాత వారిని మందలించి విడిచిపెట్టారు. దీంతో పెళ్లి వేడుక యధావిధిగా జరిగింది.


Updated Date - 2020-11-26T12:54:07+05:30 IST