పెళ్లి శుభలేఖపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’

ABN , First Publish Date - 2020-02-16T17:27:30+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్‌కు...

పెళ్లి శుభలేఖపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేజ్రీవాల్ పని తీరును మెచ్చి ఢిల్లీ ప్రజలు ఆయనకు మరోమారు పట్టం కట్టారు. కేజ్రీవాల్‌కు దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ ఉంది. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ లోగల సూర్యనగరిలో కూడా ప్రతిబింబించింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుని వివాహం సందర్బంగా పెళ్లి కార్డులపై ‘ఐ లవ్ కేజ్రీవాల్’ అని ముద్రింపజేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెళ్లి కార్డు హల్‌చల్ చేస్తోంది. 



Updated Date - 2020-02-16T17:27:30+05:30 IST