Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివాహిత అదృశ్యం - కేసు నమోదు

జడ్చర్ల, జూన్‌ 3 : మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కనిపించడంలేదంటూ ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల ఎస్‌ఐ అభిషేక్‌రెడ్డి తెలిపారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతను 20 రోజుల క్రితం స్వగ్రామం నుంచి జడ్చర్లకు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే సరికి భార్య కనిపించలేదు. పరిసర ప్రాంతాలతో పాటు ఆమె తల్లిగారి గ్రామం తదితర ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. గద్దెగూడెం గుట్టలపై గుర్తు తెలియని యువకుడి శవం లభ్యం


దేవరకద్ర, జూన్‌ 3 : మహబూబ్‌నగర్‌ జిల్లా దేవర కద్ర మండల పరిధిలోని గద్దె గూడెం  గ్రామ సమీపంలోని గుట్టలపై గుర్తు తెలియని యువకుడి శవం లభ్యమైనట్లు ఎస్‌ఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు గొర్రెలను గుట్టలపై మేపుతుండగా గుట్టపై ఉన్న శవాన్ని చూసి స్థానిక సర్పంచ్‌కు సమాచారం అందించారు. దీంతో సర్పంచ్‌  చెప్పడంతో ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి నిర్ధారించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే పొలీస్‌ స్టేషన్‌లో సమాచారం అందిచాలని ఎస్‌ఐ కోరారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం


కొత్తకోట, జూన్‌ 3 : మండలంలోని పాలెం గ్రామ శివారు జాతీయ రహదారిపై బుధవారం మధ్యరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలి యని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందా డు. మృతదేహంపై నుంచి వా హనాలు వెళ్లడంతో శవం గుర్తు పట్టరాని విధంగా నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలుసుకు న్న సీఐ మల్లికార్జన్‌రెడ్డి, ఎస్‌ఐ నాగశేఖ ర్‌రెడ్డి సంఘటన స్థలా నికి వెళ్లి నుజ్జునుజ్జు అయిన శవం నుంచి దుస్తులను వేరు చేశారు. శుభ్రం చేసిన తర్వాత బట్టలపై ఉన్న టైలర్‌ స్టిక్కర్‌ను పరిశీలించి భద్ర పరిచారు. కేసు నమోదు చేసి వ్యక్తిని గుర్తించ డం కోసం విచారణ చేస్తున్నట్లు  ఎస్‌ఐ చెప్పారు. 


చిరుత దాడిలో 10 గొర్రెలు మృతి


హన్వాడ, జూన్‌ 3 : గొర్రెలపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో 10 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మండలంలోని మునిమోక్షం గ్రామపంచాయతీ పరిధిలోని తువ్వగడ్డ తాండలో గొర్రెలపై వారం రోజుల నుంచి చిరుత దాడులు చేస్తూనే ఉంది. గొర్రెలపై వరుసగా జరుగుతున్న దాడులతో పశువుల కాపరులలో భయం నెలకొంది. అధికారులు చర్యలు తీసుకుని చిరుతను పట్టుకుని ఫారెస్ట్‌కు తరలించాలని కోరుతున్నారు. 


విద్యుదాఘాతంతో పొట్టేలు మృతి 


గండీడ్‌ (మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌) జూన్‌ 3 : విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో గొర్రె పొట్టేలు మృతి చెందింది. వివ రాలు ఇలా ఉన్నాయి. గురువా రం గండీడ్‌ మండల పరిధిలోని కొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన డి.మల్లయ్య గొర్రెలను మేపేందుకు పోలానికి వెళ్లగా తెగిపడిన కరెంటుతీగలు తగిలి గొర్రె పొట్టేలు మృతి చెందిం దని, విద్యుత్‌ అధికారుల నిర్ల క్ష్యం వల్లేనని తెలిపారు. ఈ విషయమై బాధితుడు విద్యుత్‌ ఏఈకి ఫిర్యాదు చెసిననట్లు తెలిపారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు డిమాండ్‌ చేశాడు. 

Advertisement
Advertisement